Sunday, 16 May 2021

మనసున లోకం

 ఇరుకు నాల్గు గోడల గది

నిశ్బబ్దం నాట్యమాడే స్ధలమిది

నిశీధి రంగుని నింపుకున్నది

అమావాస్య సమయమైనది

చంద్రుడ్కి సెలవు దినమిది

చిన్న వెలుగు పురుగు జాడ లేకుంది

కాంతి కిరణం శూన్యమైనది

ఆ చీకటి చిరుతరుణంలో 

ఏ విషసర్పం దాగుందనుకుంటా

బుస్సుబుస్సుమనే శబ్దాలు

తాకుతుంది భయానక‌ శ్రవణమై

ఏ మంచం కిందనుందో

ఏ తుప్పల తీగలలో వుందో

లేక నా ఆలోచనల భ్రమలోవుందో

భయమైతే వేస్తుంది గుండెకు

ఏమి లేదను మాటనే నెమరేస్తూ

చీకటితో చెలిమి కట్టేసా

ఏ వజ్రవైడూర్యాల పోగులున్నాయో

చివరన సూదిపుటంచు 

కాలికి తగిలితే రక్తం దారకడితే

ముళ్ళు అనుకోవాలో 

మణులు అనుకోవాలో

రక్తాన్ని కాంచి ముళ్ళని తలచి

గది అవతటికి విసిరిస్తే

తెల్లారాక తీరిగ్గా యేడవాలా ?

ఆ రక్తమూ వ్యర్దమే 

ఆ రాశులు మాయమే...!

ఏవేవో కదులుతున్నాయి

అవేవో భూతాలేమో

చీకట్లో తెలియట్లే

నా వైపుకు వస్తాయో

నన్నేమి చేస్తాయో

అయినా మనుషల కంటే

మహా చెడ్డవా అవి అంతేలే

ఖాళీ బుర్రకి తోడుగా చీకటి

ఊహలు అట్లే ఉంటాయి

కదిలాడే బల్లులు ఏవో

కరిచేటి నల్లులు ఏవో

నా గదిలో నాతోనే ఉండే

ఈ ఎలుకలు మిడతలు

కొత్తవి కాదుకదా ఈ

చీకటి చిరుమిత్రులు వీరే

ఈ వింత వేళలో

ఓ వెచ్చదనం ఏ మూలనో

ఏ రూపములో తాకినదో

వెతకాలని ఉన్నా

ధైర్యం ఓ ఇంత తక్కువై

కదలక కుదురుగా

కూర్చుంటూ గడిపేద్దాం

ఆలోచించి చూస్తే

ఆ చీకటి నా లోకం

అన్యాయం ఆకలి

ఆ పాముల తీరు

ద్వేషం మోసం

నల్లులు బల్లులు

కష్టం నష్టం

కాలికి తగిలిన రత్నం తీరు

భయం బానిసత్వం

కనిపించని భూతాలు

అసూయ అరాచకం

కోపం పగలు

నాకు తగిలిన వేడితనం

అన్నింటిని తనలో దాచుకుంది

నా ప్రపంచంలో దాగినవాటిమల్లే

ఏ వెలుతురు వచ్చిన

ఏ వేకువ ఉదయించిన

ఏ ఙ్ఞానం కదిలించిన

ఇవ్వన్ని మాయమై

అందమైన చక్కని గదియై

మేరిసే‌ కాంతుల భవనమై

తెరలు తొలగితే స్వర్గమే

నా ప్రపంచం నా మనోలోకం


Monday, 19 April 2021

మేఘం

 నిర్మలమైన నీలాకాశం ఒకటి

గాలి మబ్బుల స్నేహం చేసే

వీక్షకుల కంటికి ఇంపుగా మారే

ఆ హాయిలో ఆనందపు కీర్తన పాడే

మరు నిమిషం గాలికి మబ్బులు కదిలే

ఒంటరి అయ్యే మరలా ఆ ఆకాశం

చూసి చేర వచ్చే కారు మబ్బులు

చల్లని స్పర్శతో మాయను చేసే

మరలా ఆకాశం లోకం మరిచే

ఇంతలోనే కారుమేఘం చినుకులు చిందే

చిటికెలోనే మాయం అయ్యే మేఘం

మళ్ళీ ఆకాశం కథ మొదటికి వచ్చే 

ఎన్నో ఏళ్ల సూర్యుడి వేడిని చూసే

ఎంతో చల్లని చంద్రుడి చల్లదనాన్ని కాంచే

అయినా తీరలే ఆకాశం ఆకాంక్ష ..!

ముగియలే మేఘాలతో స్నేహం ఆశ..!


తెలుగు భాష

 పచ్చ పల్లెటూర్ల సోయగం తెలుగు

వెచ్చని సూర్య కిరణాల తాకిడి తెలుగు

నది ఏరు సవ్వడుల నాట్యం తెలుగు

బుల్లి గువ్వల గాన అమృతం తెలుగు

దేవుడును మెలుకొల్పు సుప్రభాతం తెలుగు

పసి పాప నవ్వుల కోలాహలం తెలుగు

లోకమంతా మెచ్చే అవని అందం తెలుగు

వృద్యాపం ఎరుగని అమ్మ ప్రేమ తెలుగు

అర్థమైనవారి నర నరమున రక్తం తెలుగు

గురు లఘువుల కలయిక కుసుమం తెలుగు

యతి ప్రాసల అల్లిక చిత్రం తెలుగు

సంది సమాసాల సుగంధం తెలుగు

పున్నమి వేళ చందమామ రూపం తెలుగు

కోరి కోరి తిను తియ్యని పరమ అన్నం తెలుగు 

శ్రీశ్రీ రాసిన రెచ్చగొట్టే విప్లవ భావాలు తెలుగు

శివుడే పరవసమయ్యే దుర్జాటి శతకం తెలుగు

హరికే హయి చూపించిన అన్నమయ్య తెలుగు

విన్న వారు వదలలేరు అద్బుతమైనది తెలుగు

కవుల కలం చివరన అక్షరం తెలుగు

పాటల పల్లకి లో ఊరిగే ప్రభువు తెలుగు

కానీ తెలుగు అంటే ఎందుకు అంతా చులకన

తెలుగు మాట లోన ఏమున్నది తక్కువ

తెలుగు పలుకులో లేదేమి లోకువ

తప్పుగా పలికే నాలుక నరం ఇరుకున

ముడిపడినది నీ వ్యక్తిత్వ ప్రకటన

చేతకాని వాళ్ళ భాష కాదు తెలుగు

తక్కువ అన్నవాళ్ళకి అర్దం అవ్వదులే తెలుగు


మేధ

 సమయం ఉదయం 8 గంటలు పోలీస్ కమిషనర్ ఆఫీస్ గందరగోళంలో వినపడే మాటలు ( ఈ రోజు ఎవరో ఒక పెద్ద bussinessman ని వాళ్ళ అబ్బాయి చంపబోయాడు అంటా.. కాస్తల...