పచ్చ పల్లెటూర్ల సోయగం తెలుగు
వెచ్చని సూర్య కిరణాల తాకిడి తెలుగు
నది ఏరు సవ్వడుల నాట్యం తెలుగు
బుల్లి గువ్వల గాన అమృతం తెలుగు
దేవుడును మెలుకొల్పు సుప్రభాతం తెలుగు
పసి పాప నవ్వుల కోలాహలం తెలుగు
లోకమంతా మెచ్చే అవని అందం తెలుగు
వృద్యాపం ఎరుగని అమ్మ ప్రేమ తెలుగు
అర్థమైనవారి నర నరమున రక్తం తెలుగు
గురు లఘువుల కలయిక కుసుమం తెలుగు
యతి ప్రాసల అల్లిక చిత్రం తెలుగు
సంది సమాసాల సుగంధం తెలుగు
పున్నమి వేళ చందమామ రూపం తెలుగు
కోరి కోరి తిను తియ్యని పరమ అన్నం తెలుగు
శ్రీశ్రీ రాసిన రెచ్చగొట్టే విప్లవ భావాలు తెలుగు
శివుడే పరవసమయ్యే దుర్జాటి శతకం తెలుగు
హరికే హయి చూపించిన అన్నమయ్య తెలుగు
విన్న వారు వదలలేరు అద్బుతమైనది తెలుగు
కవుల కలం చివరన అక్షరం తెలుగు
పాటల పల్లకి లో ఊరిగే ప్రభువు తెలుగు
కానీ తెలుగు అంటే ఎందుకు అంతా చులకన
తెలుగు మాట లోన ఏమున్నది తక్కువ
తెలుగు పలుకులో లేదేమి లోకువ
తప్పుగా పలికే నాలుక నరం ఇరుకున
ముడిపడినది నీ వ్యక్తిత్వ ప్రకటన
చేతకాని వాళ్ళ భాష కాదు తెలుగు
తక్కువ అన్నవాళ్ళకి అర్దం అవ్వదులే తెలుగు
No comments:
Post a Comment